War between Sri Krishna & Arjuna ! కృష్ణార్జునులు యుద్ధం

War between the Krishnarjunasకృష్ణార్జునులు మధ్య యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా? నారదుడు ఏం చేసాడంటే?దశావతారాల్లో ఎనిమిదవ అవతారం అయిన కృష్ణుడు చేసిన లీలలు అన్నీ ఇన్నీ కావు. వాటి గురించి చెప్పుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవు.అలాంటి కృష్ణుడు పాండవుల పక్షపాతి అని అందరూ నమ్ముతారు. ఆ నమ్మకాన్ని దూరం చేయడం కోసం శ్రీకృష్ణుడు పాండవులలో తనకు ఎంతో ప్రీతి మంతుడైన తన బావమరిది అర్జునుడితో యుద్ధం చేశాడని మీకు తెలుసా? ఆయన ఎందుకు ఈ యుద్ధం చేశారో ఇప్పుడు చూద్దాం ......శ్రీకృష్ణుడు సంధ్యావందనం చేస్తున్న సమయంలో గయుడు అనే ఒక గంధర్వుడు ఆకాశ మార్గంలో వెళుతూ కిందకు ఉమ్ముతాడు. అది సరిగ్గా సంధ్యా వందనం చేస్తున్న శ్రీ కృష్ణుని దోసిలిలో పడుతుంది. దానికి ఆగ్రహించిన కృష్ణుడు అతనిని తుదముట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కృష్ణుని ప్రతిజ్ఞ తెలిసిన గయుడు భయంతో వణికిపోతాడు. తనను తాను రక్షించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాక దిగులుగా కూర్చుంటాడు. ఆ సమయంలో అతని వద్దకు వచ్చిన నారదుడు.గయుని సమస్య తెలుసుకొని అతడిని జరిగిన విషయం చెప్పకుండా అర్జునుడిని శరణు కోరమంటాడు. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం గయుడు అర్జుడిని వద్దకు వెళ్ల…
Read more about War between Sri Krishna & Arjuna ! కృష్ణార్జునులు యుద్ధం
  • 0

Lifting of Govardhana Giri, Sri Krishna

Lifting of Govardhana Giri, Sri Krishnaశ్రీ కృష్ణుడు చిటికెన వేలితో ఎత్తిన గోవర్థనగిరి గురించి ఈ ఆసక్తికర విషయం తెలుసా?ఉధృతంగా కురిసిన వర్షాలు దాని వల్ల ఉత్పన్నమైన వరదలకు కొట్టుకుపోతున్న ప్రజలను, పశువులను కాపాడడానికి శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో గోవర్ధన గిరిని చిటికిన వేలితో ఎత్తాడు. అలాంటి గోవర్ధన గిరికి ఓ శాపం ఉంది. ఇంతకీ అప్పటి గోవర్ధన గిరి ఇప్పుడు ఎక్కడ తెలుసా?ఉత్తరప్రదేశ్ లోని మధుర ప్రాంతంలో ప్రస్తుతం ఈ పర్వతం ఉంది. ఈ పర్వతానికి ప్రతి ఏడాది దీపావళి వెళ్ళాక అక్కడి ప్రజలు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.ఇక ఈ పర్వతానికి ఏం శాపం ఉందో? అది ఎందుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం.పూర్వం పర్వత రాజైన ద్రోణకలుడికి గోవర్ధనుడు, యమున అనే ఇద్దరు పిల్లలు కలిగారు. వారిలో గోవర్ధనుడు గోవర్ధన పర్వతంగా యమున నదిగా మారారు.ఈ సమయంలో బ్రహ్మదేవుని మనమడు మహా ఋషి అయిన పులస్త్యుడు ద్రోణకలుడిని కలిసి కాశీలో గోవర్ధన పర్వతం ఉంటే భక్తులకు తమలాంటి ఋషులకు పూజలు చేయడానికి సౌలభ్యంగా ఉంటుందని కోరాడు.అందుకు ద్రోణకలుడు అంగీకరించాడు.గోవర్ధనుడికి అసలు ఈ విషయం నచ్చలేదు కానీ తండ్రి మాట కాదనలేక పులస్త్యుని వెంట ఒక షరతుతో వెళ్ళాడ…
Read more about Lifting of Govardhana Giri, Sri Krishna
  • 0

Kaliya Mardana by Sri Krishna – కాళీయమర్దన బాలకృష్ణుడు !

Kaliya Mardana by Sri Krishnaకాళీయమర్దన చేసిన బాలకృష్ణుడు !!శ్రీకృష్ణాష్టమి పర్వదినం. ఈరోజు స్వామిలీలలు స్మరించుకుంటే సకల పాపాలు పోతాయి. భయాలు దూరం అవుతాయి. ఆయన కృపకు పాత్రలము అవుతాం. బాలకృష్ణుడి లీలలు అన్ని ఇన్ని కాదు. ఆయన పుట్టినది మొదలు ఎనోన లీలలను చేసి చూపాడు. సాక్షాత్తు భగవత్‌ స్వరూపంగా పలు మార్లు ఆయన ప్రకటించుకున్న అవతారం. వీటిలో కాళీయ మర్దనం గురించి స్మరించుకుందాం.కాళియ నాగుపాము యమునా నదిలో నివాసం ఏర్పరచుకుంది. ఆ పాము చిందించే విషంతో యమునా జలం కలుషితం అయింది. అంతేనా.... ఆ విషపు వేడికి నీలు మరుగుతూ, నదిపై ఎగిరే పక్షులకు కూడా హాని చేస్తోంది. ఆ వేడి సేగాలకు తట్టుకోలేక పక్షులు, నదిలో పడి చనిపోసాగాయి. ఇది చూసిన బాల కృష్ణుని మనసు ఆర్ద్రమైంది.దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దైవ లక్షణం కదా! యమునా జలాలకు కాలుష్యం నుండి విముక్తి ప్రసాదించాలని, కాళీయుని కోరల్లోంచి వెలువడుతోన్న విషం నుండి పశుపక్ష్యాదులను కాపాడాలని, యమునా జలాన్ని తిరిగి మంచినీటిగా మార్చాలని అనుకున్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకాడు. కాళీయ సర్పం కృష్ణుని చూసింది. తనకు అపకారం తలపెట్టిన బాలకుడు ఎవరు అని ఆశ్చర్యపోయిం…
Read more about Kaliya Mardana by Sri Krishna – కాళీయమర్దన బాలకృష్ణుడు !
  • 0

Sri Krishna Janmashtami, Birthday of Sri Krishna

Sri Krishna Janm Ashtami, Birthday of Sri KrishnaSri Krishna Janmashtami 2020: ఇది శ్రీకృష్ణుడి ఎన్నో జన్మదినమో తెలుసా?శ్రీకృష్ణ జన్మాష్టమినే...  గోకులాష్టమి అని కూడా అంటారు. నందగోపాలుడి జన్మదినం సందర్భంగా...భారతదేశం మొత్తం ఈ ప్రత్యేక పండుగను జరుపుకుంటుంది. హిందూ కేలండర్ ప్రకారం... భాద్రపద మాసంలో...కృష్ణ పక్షంలో అష్టమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం... కృష్ణాష్టమిని ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణ భగవానుణ్ని చెప్పుకుంటారు. దృక్‌పంచాంగం ప్రకారం...ఈ సంవత్సరం శ్రీకృష్ణుడి 5247వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. అంటే... 5వేల ఏళ్ల కిందట శ్రీకృష్ణుడు జన్మించినట్లు లెక్క. ఓ గోపాలుణ్ని పూజిస్తూ...ఈ పండుగ నాడు ప్రతి ఇంట్లో పిల్లల్ని బాలకృష్ణుడిలా అలంకరిస్తారు. ప్రతీ సంవత్సరం కృష్ణాష్టమి తేదీ మారుతూ ఉంటుంది. ఎక్కువగా రెండు రకాలుగా ఇది జరుగుతూ ఉంటుంది. మొదటిది స్మార్థ సంప్రదాయం, రెండోది వైష్ణవ సంప్రదాయం. కృష్ణ జన్మాష్టమిని అష్టమి రోహిణీ, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా అంటారు. దృక్ పంచాంగం ప్రకారం... ఈ సంవత్సరం ఆ…
Read more about Sri Krishna Janmashtami, Birthday of Sri Krishna
  • 0