Ravana – Rambha – రావణాసురుడు — రంభ —

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు 

Ravana – Rambha –  రావణాసురుడు — రంభ — 

Raavana :  రావణాసురుడు —

కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని) చేసినవాడు అని అర్ధము . 

రావణుడు (Ravana) రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. 

రామాయణం ప్రకారం రావణుడు లంక కు అధిపతి. పది రకాలుగా ఆలోచించేవాడనే దానికి, పది విద్యలలో ప్రవీణుడు అన్నదానికి ప్రతీకగా, కళారూపాలలో రావణుని పదితలలతో చిత్రిస్తారు. 

పదితలలు ఉండటం చేత ఈయనకు దశముఖుడు (పది ముఖములు కలవాడు), దశగ్రీవుడు (పది శీర్షములు కలవాడు), దశ కంథరుడు, దశకంఠుడు (పది గొంతులు కలవాడు) అన్న పేర్లు వచ్చాయి. 

బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రవసునికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. 

కైకసికి తండ్రి సుమాలి. 

రావణుని భార్య మండోదరి ‘ .

రావణాసురుడి కి ఆరుగురు సోదరులు ,ఇద్దరు సోదరీమణులు, ఏడుగురు కొడుకులు . 

సోదరులు :

1. కుబేరుడు 

2. కుంభకర్ణుడు 

3. విభీషణుడు 

4. ఖరుడు 

5. దూషణుడు 

6. అహిరావణుడు 

సోదరీమణులు: 

1. శూర్పణఖ(చంద్రనఖు),  2.కుంభిని 

కుమారులు :

1. ఇంద్రజిత్తు

2. ప్రహస్థుడు,

3. అతికాయుడు

4. అక్షయకుమారుడు,

5. దేవాంతకుడు,

6. నరాంతకుడు

7. త్రిశిరుడు.


Rambha : రంభ — 

  • ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. 

  • రూప రేఖాలావణ్యాలు గల నర్తకి. 

  • దేవలోకానికి అధిపతియైన ఇంద్రుడు భూలోకములో ఋఉషుల తపస్సు లను భగ్ననము చేయుటకు పంపే అప్సరసలలో రంభ ఒకతె . 

  • రంభ , కుబేరుని కొడుకు అయిన నలకుబేరునిభార్య .

02/05/2015 7:57 PM