పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు
Dronudu : ద్రోణుడు – ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు. భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేదవేదాంగాలన్నీ అభ్యసించాడు. ద్రోణుడితో పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ. పరశురాముడు వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. అది తరవాతి కాలంలో హస్థినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్రవిద్య నేర్పటానికి దారితీసింది. . అర్జునుడు అతనికి ప్రియ విద్యార్థి.
DakshinAyanamu : దక్షినాయనము : సూర్య్భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన సమయం నుండి మకరరాశిని చేరే వరకు మధ్యనున్న సమయమే దక్షిణాయనము . ఆ సమ్యములో సూర్యుడు భూమధ్యరే్ఖకు దక్షిణము గా సంచరిస్తాడు .
Dhvajastambham : ధ్వజస్తంభము — సూర్యుని కాంతి కిరణములు నలభై ఐదు డిగ్రీల కోణము లో పరవర్తనము చెందుతాయి . ఆ దిశగా ధ్వజస్తంభాన్ని ప్రతిస్ఠారు . దక్షిణ వైపు నుంచి వచ్చే కుజగ్రహ కిరణాలు గోపుర కలశము మీదుగా ధ్వజస్తంభము పైనుంచి స్వామి భూమధ్యకి చేరుతాయి అందుకే ధ్వజస్తంభమునకు , స్వామికి మధ్యన నిల్చుని నమస్కరించాలి . అప్పుడే గ్రహశక్తితో పాటు స్వామి శక్తీ మనల్ని చేరుతుంది .