పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు
Damodarudu : దామోదరుడు — క్రిష్ణుడు చిన్నతనం లో తల్లి యశోద అతని నడుముకు పొట్టకు కట్టువేసి బండరాయికి కట్టివేసినది . బంధితమైన పొట్టగల వాడు కనుకనే ఆ నాటి నుంచి ఆయనకు దామోదరుడు అనే పేరొచ్చింది.
Dasarathudu : దశరధుడు – దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు. అయోధ్య రాజ్యానికి రఘు వంశపు రాజు . ముగ్గురు -(కౌషల్య , సుమిత్ర , కైకేయి ) భార్యలకు … రాముడు , లక్ష్మణుడు , భరత ,శత్రుఘ్నులు (నలుగురు) కుమారులు .
Dattatreyudu : దత్తాత్రేయుడు — శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
Draupadi : ద్రౌపది — పాంచాల రాజైన ద్రుపద మహారాజు కుమార్తె . మహాభారరము లో ప్రముఖ పాత్ర . అర్జునుడు మత్స్యయంత్రము కొట్టగా ఆమె పాండవులకు భార్య అయినది .
DrupaduDu : దృపదుడు — పాంచాల రాజు . ద్రౌపది తండ్రి . ఈయన కుమారులు … ద్రుష్టద్యుమ్నుడు , శిఖండి .