anjaneyudu ambika 1 & 2

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలుAnjanEyuDu : ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు అని అర్ధము . హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి,మారుతి , వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.Ambika : అంబిక-- 1. హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. Ambika : అంబిక--2. మహాభారతము లో సత్యవతి - శంతన మహారారు కుమారుడైన చిత్రాంగుని భార్య పేరు అంబిక . భర్త చనిపోయిన తరువాత ఈమె కు వ్యాసుని వలన గుడ్డివాడైన ధృతరాస్ట్రుడు జన్మిస్తాడు .
Read more about anjaneyudu ambika 1 & 2
  • 0

agni anasuya anjana

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలుAgni - అగ్ని: వేదములలో పేర్కొన్న ఓక దేవతా మూర్తి . అతని భార్య స్వాహాదేవి.Anasuya : అనసూయ - అసూయ లేనిది. అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులను చేసి లాలించింది. లోకమాతలకు పతిభిక్షపెట్టి అత్తగారిగా నిలిచింది. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనే పుత్రున్ని పొందింది.Anjana - అంజన: కుంజరుడి కుమార్తె వానర స్త్రీ. కేసరి భార్య. వాయుదేవునితో సంగమము వల్ల అంజనేయుని కన్నది.
Read more about agni anasuya anjana
  • 0