radha rathidevi renuka

radha rathidevi renuka పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగాRadha : రాధ లేదా రాధిక -- శ్రీకృష్ణుని ప్రియురాలు , నందుని చెల్లెలు . కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు. భారతదేశంలో రాధాకృష్ణులకు చాలా దేవాలయాలు ఉన్నాయి. రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్నిశతాబ్ధాలుగా వర్ణిస్తూ, చిత్రీకరిస్తూనే వున్నారు..Rathidevi : రతీదేవి --దక్ష ప్రజాపతి కూతురు . మన్మధుని భార్య , మన్మథుడు లోకాలన్నిటినీ మోహింప చేయగల శక్తి ఉన్నవాడు. అలాంటి మన్మథుడినే మోహింప చేయగల శక్తి ఉన్న అతిలోక సర్వావయవ సౌందర్యవతి రతీదేవి. ఈ ఇద్దరికీ వివాహం ఎప్పుడు ఎలా అయింది? అనే విషయాన్ని కామ వివాహం అనే పేరున శివపురాణం రుద్ర సంహితలోని మూడు, నాలుగు అధ్యాయాలు వివరిస్తున్నాయి. మన్మథుడు బ్రహ్మ మనస్సు నుంచి జన్మించిన తర్వాత ఆ బ్రహ్మ దేవుడు తనతో సహా అందరినీ మోహింప చేయగల శక్తిని మన్మథుడికి అనుగ్రహించాడు.Renuka : రేణుక --రేణుక భృగు వంశానికి చెందిన మహర్షి జమదగ్ని భార్య,. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు. 
Read more about radha rathidevi renuka
  • 0

pariksit puthana pradyumnudu raama

pariksit puthana pradyumnudu raama పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు --Parikṣit : పరీక్షిత్తు -- అంటే అంతటా దర్శించగలవాడని అర్దము . అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము యోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్ధించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతి ని వివాహము చేసుకొనెను. ఇతని కుమారుడు జనమేజయుడు.Puthana : పూతన --- ఒక రాక్షసి . బాలకృష్ణుని చే వధించబడుతుంది .Pradyumnudu : ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము). ప్రద్యుమ్నుడు శ్రీ కృష్ణుడి కి రుక్మిణి కి జన్మించన సంతానం. ప్రద్యుమ్నుడి పాత్ర భాగవతం లొ వస్తుంది. శంభరాసురుడు అనే రాక్షుసుడిని సంహరిస్తాడు . మాయవతి (రతి దేవి) ఈయన భార్య .PanchavaTi , పంచవటి : రాముడు వనవాస సమయం లో దండకారణ్యములోని ఆశ్రమము పేరు . Raama : రాముడు -- హిందూ దేవతలలో ప్రముఖుడు. ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజై పరిపాలించాడు . అతను పురాతన భారత దేశమును…
Read more about pariksit puthana pradyumnudu raama
  • 0

prahlaadudu parsuraamudu

prahlaadudu parsuraamudu పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు --Prahlaadudu : ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు . ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన హిరణ్యకశిపుని కుమారుడు. ప్రహ్లాదునకు దమని అనే కన్యతో వివాహము జరిగినది. వీరికి వాతాపి, ఇల్వలుడు అనే కుమారులు కలరు.Parasuraamudu : పరశురాముడు-- శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము (Parasurama Incarnation) ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు. Paraasharudu : పరాశరుడు -- వసిష్టుని మనుమడు. శక్తి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి. పరాశరుడు ఒకనాడు తీర్థయాత్రకు పోవుచు యమునా నదిలో పడవ నడుపుచున్న మత్స్యగంధిని చూచి మోహించెను. ఆమె కన్యాత్వము పాడవకుండా అభయమిచ్చి, శరీరపు దుర్వాసన పోవునట్లు వరం ప్రసాదించి, య…
Read more about prahlaadudu parsuraamudu
  • 0

manmadhudu mahishasura

manmadhudu mahishasura పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు --ManmadhuDu : మన్మధుడు - మన్మధుడు అంటే మనస్సు కలత పెట్టువాడు , మనసుని మధించేవాడని పురాణాలు వర్ణించాయి.మన్మధుడు పూవిలుకాడు. పూల బాణాలు వేసి గుండెలలో ప్రేమను పెంచును. ఈయనకు మనసిజుడు అని , అనంగుడని , పుష్పధన్యుడు అని పేర్లు ఉన్నాయి . మంచి రూపం కలిగిన వాడు. విష్ణువు కు మానస పుత్రుడు. రతీదేవి ఈయన భార్య. .Mahishasura : మహిషాసురుడు -- హిందూ పురాణాలలో రాక్షసుడు1. మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు 'మహిషం' (గేదె) తో కలిసి రతిలో పాల్గొన్న మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై(గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి మహిషాసురుడు కి జన్మనిస్తుంది. దుర్గాదేవి మహిషున్ని ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది.Mahishaasura mardhini : మహిషాసుర మర్ధిని -- మహిషాసురుడనే రాక్షసుడిని చంపడం వల్ల పార్వతికి ఈ పేరు వచ్చినది . MaareechuDu : మారీచుడు : రాక్షసి తాటక కి…
Read more about manmadhudu mahishasura
  • 0

kuru dynasty lalitha lankhini

kuru dynasty lalitha lankhini పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు --కురువంశము, Kuru Dynasty : భరతుడి తరువాత వంశం--భరతుడి కుమారుడు భుమన్యుడు, భుమన్యుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు హస్తి , హస్తి పేరు తోనే ఉన్నదే అప్పటి కురురాజుల రాజధాని, ఇప్పటి ఢిల్లీ నగరమైన హస్తినాపురం. హస్తి కుమారుడు వికంఠనుడు, వికంఠనుడి కుమారుడు అజమేఢుడు. అజమేఢుడికి 124 కుమారులు. వాని కుమారులలో ఒకడైన సంవరణుడికి సూర్యుని కుమార్తె అయిన తపతికి వివాహం జరిగింది. వారి కుమారుడు కురు. కురు పేరు తోనే కురువంశం వృద్ధి చెందింది. కురు కుమారుడు విదూరధుడు. విదూరధుడి కుమారుడు అనశ్వుడు. అనశ్వడి కుమారుడు పరిక్షిత్తు , పరిక్షిత్తు కుమారుడు భీమసేనుడు. భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుడి కుమారుడు శంతనుడు.Lalitha : లలిత--హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.Lankhini : లంఖిణి -- లంకను కాపలాక…
Read more about kuru dynasty lalitha lankhini
  • 0

kucheludu kamsudu kabandudu

kucheludu kamsudu kabandudu  పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు --Kucheludu : కుచేలుడు--చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము). శ్రీ కృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కందము లో వస్తుంది. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీ కృష్ణుడు ,కుచేలుడు ..సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. అప్పుడు శ్రీ కృష్ణుడికి సహాధ్యాయి కుచేలుడు. విద్యాభ్యాసము అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. కుచేలుడు తన స్వగ్రామము చేరుకొన్నాడు.KamsuDu : కంసుడు -- ఉగ్రసేనుని కుమారుడు , శ్రీకృష్ణుని మేనమామ . మధురా నగరాన్ని యాదవవంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భం లో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహరాజును కూడా చెరసా…
Read more about kucheludu kamsudu kabandudu
  • 0

kauravulu kedaareswarudu kaikeyi kuberudu

kauravulu kedaareswarudu kaikeyi kuberudu పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు --..Kauravulu : కౌరవులు -- కురువంశరాజులు . మహాభారతం లో దుర్యోధనాదులు వందమంది . కురువంశములో జన్మించిన వారిని కౌరవులు అంటారు. కానీ మహాభారతములో ప్రధానముగా ధృతరాష్ట్రుని సంతతిని సూచించటానికే ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గాంధారికి జన్మించినవారు 100 మంది పుత్రులు, 1 పుత్రిక. ఒక వైశ్య వనిత ద్వారా ధృతరాష్ట్రునికి మరొక పుత్రుడు యుయుత్సుడు జన్మించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో గాంధారి పుత్రులు అందరూ మరణించారు.Kedaareswarudu : కేదారేశ్వరుడు - శివునికి మరో పేరు . కేదారేశ్వర ఆలయము హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో ఉన్నది , మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనమునకు తెరచి ఉంటుంది.Kaikeyi : కైకేయి --అశ్వపతి కూతురు . దశరధమహారాజు ముడో భార్య . భరతుని తల్లి .Kuberudu : కుబేరుడు -- హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఈతని నగరం అలకాప…
Read more about kauravulu kedaareswarudu kaikeyi kuberudu
  • 0

kumaara swaami katyaanyini kali

kumaara swaami katyaanyini kali  పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు --Kumaara swaami :కుమార స్వామి - శివ పార్వతుల ఇద్దరి కుమారులలో చిన్నవాడు కుమారస్వామి. ఇతనికి ఇద్దరు బార్యలు -- శ్రీవల్లి , దేవసేన .Katyaayini : కాత్యాయిని --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.Kali : కాళి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.కాళిదాసు,Kalidasu : ఒక గొప్ప సంస్కృత కవి మరియు నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు నిలువెత్తు సాక్షం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు మరియు నాటకములు చాలావరక…
Read more about kumaara swaami katyaanyini kali
  • 0

jaraasandhudu jaambavanthudu kamadhenuvu

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలుJaraasandhudu : జరాసంధుడు -- పరమ శివ భక్తుడు మరియు రాక్షసుడు. జరాసంధుడు బృహధ్రద్రుడి కుమారుడు. మగధను పరిపాలించిన మహారాజు. మహాభారతంలో సభాపర్వం లో వచ్చే పాత్ర. బృహద్రధ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యల వలన సంతానం లేదు. సంతానము కోసము రాజు కోరిక మేరకు ఋషి చందకౌశిక మహర్షి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి, దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు. (ఆ ఋషికి బృధ్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు). రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగ భాగం చేసి ఇద్దరికి పెడతాడు. ఆ సగ భాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దీనితో దిబ్భాంత్రి లొనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని ఆవల విసిరి వేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరి వేస్తారు. అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు. జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుండి. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహా…
Read more about jaraasandhudu jaambavanthudu kamadhenuvu
  • 0

ekalavyudu ethasham gouri

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలుEkalavyuDu : ఏకలవ్యుడు -- మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. నిషాధ తెగకు చెందినవాడు. తక్కువ కులానికి చెందిన వాడైనా ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు. ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు మరియు మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఏకలవ్యుడు ఎక్కడ తనను మించిపోతాడనే భయంతో అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుని ఆశ్రయించి ఏదైనా చర్య తీసుకోమని కోరాడు. అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుని వద్దకు వెళ్ళి అతని కుడి చేతి బొటనవేలును గురుదక్షిణ గా ఇమ్మని అడుగుతాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడి చేతి బొటన వేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు. చరిత్రలో నిలిచిపోయాడు.Ethasham : ఏతశం --సూర్యుని రధం గుర్రాలలో ఒకటి Gouri : గౌరి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చిం…
Read more about ekalavyudu ethasham gouri
  • 0