Yudhisturudu – యుధిష్టిరుడు

YudhisturuDu :యుధిష్టిరుడుyudhisturudu పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలుYudhisturuDu :యుధిష్టిరుడు -- ధర్మరాజు కు యుధిష్టిరుడని మరొక పేరు , మహాభారతము లో పంచపాండవులలో మొదటివాడు . . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి. జూదము లో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టు గా ఉంటాడు.
Read more about Yudhisturudu – యుధిష్టిరుడు
  • 0

Yashoda, yaagyavalkudu యశోద యాజ్ఞవల్కుడు

Yashoda, yaagyavalkudu Yashoda, yaagyavalkudu పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలుYashoda : యశోద -- యశస్సును (కీర్తి) కలిగించునది. భాగవతము లో యశోద నందుని భార్య గోకులవాసి .. శ్రీకౄష్ణుని పెంపుడు తల్లి . బలరాముడు , సుబద్రలు ఈమె వద్దనే పెరిగేరు . యశోదా-నందులకు ' ఏకనంగా ' అనే సొంత కూతురు ఉందటారు .YaagyavalkuDu :యాజ్ఞవల్కుడు -- ప్రాత:స్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఈయన భాష్కలుని వద్ద ఋగ్వేదము,జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించారు. వైశంపాయుని వద్ద యజుర్వేదాద్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపము లోగక్కి శాపాన్ని బాపుకున్నారు. ఆయన గక్కిన పదార్దాన్ని తిత్తిరిపక్షులు తిని తిరిగి అవి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్దికెక్కాయి. ఆతరువాత యాజ్ఞవల్కుడు సూర్యభగవానుని ఆరాధించి ,శుక్లయజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాదించాడ. తరువాత కాత్యాయిని అనే ఆమెను వివాహము చేసుకున్నాదు. గార్గి శిష్యురా…
Read more about Yashoda, yaagyavalkudu యశోద యాజ్ఞవల్కుడు
  • 0

Viswamitra విశ్వామిత్రుడు

Viswamitra విశ్వామిత్రుడు viswamitra పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలువిశ్వామిత్రుడు ,Viswamitra : హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి:గాయత్రీ మంత్ర సృష్టి కర్తశ్రీరామున కు గురువు.హరిశ్చంద్రుని పరీక్షించినవాడు.త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడుశకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.
Read more about Viswamitra విశ్వామిత్రుడు
  • 0

Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు

Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు vidhura, vibhishana viswarupudu పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలుVidhura : విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు. విదురుడి జననం--కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబిక ని, అంబాలిక ని దేవరన్యాయం ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం(pale) వల్ల పాండు రోగంతో పాండు రాజు జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబిక కి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసితో సంభోగించగా జన్మించిన వాడు విదురుడు.Vibhishana : విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు అని అర్దము . రామాయణంలో ఒక ముఖ్య పాత్ర. రావణ, కుంభకర్ణు లు విభీషణుడి అన్నలు. ఇతని భార్య పేరు ' సరమ ' . రావణ సంహారము త…
Read more about Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు
  • 0

uluchi vaalmiki vedi vyaasudu

uluchi vaalmiki vedi vyaasudu పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగాUluchi : ఉలూచి -- నాగకన్య . వాసుకి కుమార్తె . అర్జునుడు ఈమె ద్వారా ' ఇలావంతుడు ' ని జన్మనిస్తాడు .Vigneswarudu : విఘ్నేశ్వరుడు - శివ పార్వతుల ఇద్దరి కుమారులలో పెద్దవాడు విఘ్నేశ్వరుడు , గణేషు , గనపతి అని అనేక పేర్లు ఉన్నాయి. ఇతనికి ఇద్దరు భార్యలు సిద్ధి , బుద్ధి .vaalmiki : వాల్మీకి - నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి అయ్యాడు. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వాల్మీకి ముని పూర్వపు నామధేయం అగ్ని శర్మ, తండ్రి ముని ప్రచితాస(Prachetasa sage) .అతి చిన్నవయసులో అడవిలో తప్పిపోయి రత్నాకరుడు గా ఒక బోయవాని దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు పెంపుదు తల్లిదండ్రులు కౌశికి, సుమతి.Vedi : వేది -- బ్రహ్మ దేవుని భార్య ;VyaasuDu : వ్యాసుడు - వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు. హైందవసాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడు గా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు ఉపవేదాలు , 555 బ్రహ్మసూక్తులు , 108 ఉపనిషత్తులు , మహాభారతం…
Read more about uluchi vaalmiki vedi vyaasudu
  • 0

uma parvathi usha ushana

uma parvathi usha ushana పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా Uma : ఉమ - పార్వతి ( Parvati) హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.Usha : ఉష -- వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని కూతురే ఉష . శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు ఈమె భర్త. వీరి కుమారుడు వజ్రుడు. బాణాసురుని వంశపరంపర-> * బ్రహ్మ కుమారుడు పరిచుడు * పరిచుని కుమారుడు కాశ్యపుడు * కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు * హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు * ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు * విరొచుని కుమారుడు బలి చక్రవర్తి * ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు * ఆ బాణాసురుని భార్య కండల.ushana : ఉశన -- భృగువు భార్య , శుకృడి తల్లి .
Read more about uma parvathi usha ushana
  • 0

uttara uttarudu urmila

uttara uttarudu urmila పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగాUttara : ఉత్తర -- విరాటరాజు కుమార్తె. ఉత్తరుడు ఈమె సహోదరుడు. పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేసారు. అర్జునుడు తను ఇంద్రలోకంలో అప్సరసల వద్ద నేర్చుకున్న నాట్యము ఉత్తరకు నేర్పించాడు. తరువాత అర్జునుడు ఉత్తరను తన కుమారుడు అభిమన్యునితో వివాహము చేసాడు. అభిమన్యుడు పిన్న వయసులోనే కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాడు. అభిమన్యుడు మరణించే సమయమునకు ఉత్తర గర్భందాల్చి ఉన్నది. ఆమెకు పుట్టిన కుమారుడు పరీక్షిత్తు. యధిష్టురుని తరువాత హస్తినాపురానికి పరీక్షిత్తు రాజు అయ్యాడు.UttaruDu : ఉత్తరుడు -- విరాట రాజ్యానికి రాజైన విరాటరాజు కు ఇతని భార్య సుధేష్ణ కు పుట్టిన కుమారుడు . ఉత్తర ఈయన సహోదరి .Urmila : ఊర్మిళ -- రామాయణంలో దశరథుని కోడలు మరియు లక్ష్మణుని భార్య. సీతారాములతో లక్ష్మణుడు వనవాసాలకు పోయిన తరువాత, అతనికి శ్రీరామ సంరక్షణార్ధం నిద్రలేమి కలిగింది. అందువలన ఊర్మిళ ఆ పదునాలుగు సంవత్సరాలు నిదురపోయిందని అంటారు. ఆధునిక కాలంలో ఎక్కువసేపు నిద్రపోయే వారిని ఊర్మిళాదేవితో పోలుస్తారు. 
Read more about uttara uttarudu urmila
  • 0

tumburudu urvashi

tumburudu urvashi పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగాTumburudu : తుంబురుడు - తుంబుర (వాద్య విశేషము) కలవాడు. గందర్వుడు , విష్ణు భక్తుడు మరియు దేవగాయకుడు . నారదుని తో పోటాపోటి గా నిలిచి నారద-తుంబురులు గా ప్రసిద్ధిగాంచిరి .Trishankudu : త్రిశంకుడు - 1. తండ్రిని ఎదిరించుట 2, పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు శంకువులు(పాపాలు) చేసినవాడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన సత్యవంతుడు అనే మహారాజు, కులగురువులైన వశిష్ఠుడి తో వైరం నొంది వశిస్టుని కుమారులచే శపించబడి చండాలరూపాన్ని పొంది , విశ్వామిత్రుని ఆశ్రయించి త్రిశంకుస్వర్గము ( విశ్వామిత్రుని చే సృస్టించబడినది )నకు రాజైయ్యాడు .Urvashi : ఊర్వశి - ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది. ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. పూర్వం విశ్వామిత్రుడు తపస్సు ను భంగం చేయడానికి రంభ ను దేవేంద్రుడు పంపుతాడు. రంభ విశ్వామిత్రుడు తపస్సు ను భంగం చేయడానికి ప్రయత్నిస్తుండగా, విశ్వామిత్రుడు రంభ గర్వమనచడానికి తన ఉర్వుల నుండి ఒక అందమైన స్త్రీ ని సృష్టించాడు. ఆమె ఊర్వశి. విశ్వామిత్రుడు ఊర్వుల నుండి జన్మించింది కనుక ఊర్వశి అయింది. 
Read more about tumburudu urvashi
  • 0

tapati taara taataki

tapati taara taataki పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగాTapati : తపతి -- సూర్యుని కుమార్తె . -- సంజ్ఞ రూపంలో చాయ సూర్యుడికి చాలాకాలం సేవలు చేసింది. ఆమెకు సూర్యుడి వల్ల శనీశ్వరుడు, తపతి కలిగారు. తపతి అందాల బొమ్మ, సుగుణాల ప్రోగు. ఆమెకు యుక్త వయస్సు వచ్చేసరికి మరింత అందంగా తయారైంది. సూర్యుడు కుమార్తెకు పెళ్ళిచేయాలని నిశ్చయించుకున్నాడు. తగిన వరుడికోసం అన్వేషిస్తున్నాడు. చంద్రవంశ రాజు ఋక్షుని కుమారుడు సంవరణుడు తో ప్రతిష్ఠానపురంలో వారిద్దరి వివాహం వశిష్టుడి ఆధ్వర్యంలో అతి వైభవంగా జరిగింది. ఆ దంపతులకు కురు వంశానికి మూలపురుషుడైన 'కురువు' జన్మించాడు. వింధ్య పర్వతాలకు పశ్చిమంగా ప్రవహించి ప్రజల పాపాలు పోగొట్టమని భాస్కరుడు తన కుమార్తెను దీవించాడట. తండ్రి ఆశీస్సును అనుసరించి తపతీదేవి నదీమతల్లిగా మారి నర్మదానదిలో లీనమై ప్రవహిస్తోంది.Taara : తార -- తారుని కుమార్తె . వాలి భార్య . అంగదుని తల్లి . వాలి మరణించిన అనంతరము తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. కాని అది వీలుపడదని కర్మా-ధర్మాలను అనుభవించవసిందేనని తాను నిమిత్తమాత్రుడునని హితవు పలికెను . వాలి సోదర…
Read more about tapati taara taataki
  • 0

revathi rukmini rushyam sambudu

revathi rukmini rushyam sambudu  పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా Revathi : రేవతి -- ఒక నక్షత్రము . దక్షప్రజాపతి కూతురు . చంద్రుని భార్య , భార్యలందరిలో రేవతి అంటే చంద్రునికి మిక్కిలి ప్రేమ .Rukmini : రుక్మిణి - రుక్మము(బంగారము) కలది. రుక్మిణీ దేవి శ్రీ కృష్ణుడి ఎనమండుగురి భార్యల లొ పెద్ద భార్య. ఈమెను లక్ష్మీ దేవి అంశగా హిందువులు నమ్ముతారు. రుక్మిణీ దేవికి సంబంధించిన కథలు మహా భాగవతము దశమ స్కందము లొ వస్తుంది. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆ రాజు కి రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు. వీరికి రుక్మిణీ అనే సోదరి ఉన్నది. రుక్మిణి కొడుకు ప్రద్యుమ్నుడు .RushyamUkamu : ఋష్యమూకము -- అన్న వాలి చే తరుమబడి సుగ్రీవుడు తలదాచుకున్న కొండ . తన తల వేయి ముక్కలవును అనే ముని శాపము తో వాలి ఈ కొండ దరిదాపులకు రాడు .Shakti : శక్తి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్…
Read more about revathi rukmini rushyam sambudu
  • 0