badrakaali bruhaspati bharatudu

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు

Badrakaali : బద్రకాళి — పార్వతి ( Parvati) మరో పేరు . హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, బద్రకాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Bruhaspati : బృహస్పతి – బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్‌పతి).బృహస్పతి కి ఇంకో పేరు గురుడు. బృహస్పతి దేవతలకు గురువు. బృహస్పతి భార్య తార చంద్రుని అందానికి మోహించి పతిలేని సమయంలో చంద్రుని తో రతి సరసాలు జరిపెను . అందువలన గర్భవతి అయ్యెను. ఈమెను చంద్రుడు తీసుకొనిపోగా, బృహస్పతితో యుద్ధం జరిగెను. ఇంతలో తారకు బుధుడు జన్మించెను. తగవు తీర్చడానికి వచ్చిన బ్రహ్మ తారను అడిగి నిజం తెలుసుకొని బుధుని చంద్రునకు, తారను బృహస్పతికి ఇప్పించెను.

Bharatudu : భరతుడు – అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.


1.భరతుడు రామాయణంలో దశరథుని కుమారుడు మరియు శ్రీరాముని తమ్ముడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన మాండవిని భరతునితో వివాహం జరిపిస్తారు. సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదులకు పట్టాభిషేకం జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు.


2. భరతుడు మహాభారతములో శకుంతల-దుష్యంతుల కుమారుడు . భరతుడు పరిపాలించిన దేశము గనుక భారతదేశము అని పేరు వచ్చినది .

30/04/2015 7:45 PM