పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు
Akarkaarudu – అకర్కారుడు : కద్రువ కొడుకు. ఒక సర్పం.
Aparna : అపర్ణ –హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
Ayati : అయతి — మేరువు కుమార్తె , ధాత భార్య . ఈమె కుమారుడు .. ప్రాణుడు .
AkshayapAtra : అక్షయపాత్ర — అరణ్యవాసము చేస్తున్న ధర్మరాజు తనవెంట బ్రాహ్మణ భోజనార్ధం సూర్యుడుని ప్రార్ధించి ఒక పాత్ర సంపాదించారు . దానిలో కొద్దిగా వండినా అక్షయమవుతుంది (సరిపోయినంత) , దానితో ధర్మరాజు నిరంతరము అన్నదానాలు చేస్తుంటాడు .
Agnishauchamu , అగ్ని శౌచము : కర్కోటకుడు నలునికి ఇచ్చిన మాయా వస్త్రము .