పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు
Agni – అగ్ని: వేదములలో పేర్కొన్న ఓక దేవతా మూర్తి . అతని భార్య స్వాహాదేవి.
Anasuya : అనసూయ – అసూయ లేనిది. అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులను చేసి లాలించింది. లోకమాతలకు పతిభిక్షపెట్టి అత్తగారిగా నిలిచింది. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనే పుత్రున్ని పొందింది.
Anjana – అంజన: కుంజరుడి కుమార్తె వానర స్త్రీ. కేసరి భార్య. వాయుదేవునితో సంగమము వల్ల అంజనేయుని కన్నది.