పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు
BabruvAhanuDu-బభృవాహనుడు : బభృవాహనుడు అర్జునుడు మరియు మణిపురపు రాకుమారి చిత్రాంగదలకు కలిగిన కుమారుడు. అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి చిత్రాంగదను చూచి వలచాడు. చిత్రాంగద తండ్రి అయిన చిత్రవాహనునికి ఆమె ఒక్కతే సంతానం. చిత్రవాహనుడు చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి అర్జునుడు చిత్రాంగదను వివాహము చేసికొన్నాడు. బభృవాహనుడు తన తాత తదనంతరం మణిపురమును పాలించాడు.
Bali chakravarti:బలిచక్రవర్తి — బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడు మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, వామనుడు(హరి) తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపుతాడు.
BarbareekuDu –బర్బరీకుడు : బర్బరీకుడు మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతడు శ్రీకృష్ణుని చేత వధించబడ్డాడు.