భక్తి యోగము(12 వ అధ్యాయం) bhakti yogam telugu bhagavad gita

భక్తి యోగము(12 వ అధ్యాయం) bhakti yogam telugu bhagavad gita devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

భక్తి యోగము(12 వ అధ్యాయం)

అర్జునుడు:
సగుణారాధకులు,నిర్గుణారాధకులు వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు?
కృష్ణుడు:
నిత్యం తమ మనసులో నన్నే ఏకాగ్రచిత్తంతో ఉపాసించే భక్తులే శ్రేష్ఠులు.నిరాకార నా రూపాన్ని పూజించువారు ద్వంద్వాతీతులు.ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వ్యవ్యాపము నిశ్చలము,నిత్యసత్యము ఐన నా నిరాకారమును పూజించువారు కూడా నన్నే పొందుతారు.
సగుణోపాసన కన్న నిర్గుణోపాసన శ్రేష్ఠము.దేహాభిమానం కల్గిన వారికి అవ్యక్తమైన నిర్గుణబ్రహ్మము లభించడం కష్టం.
ఎవరైతే సర్వకర్మఫలాలు నాకు సమర్పించి,నాను ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారు మృత్యురూపమైన సంసారాన్ని తరింపచేస్తాను.
మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో ప్రయత్నించు.అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి.అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మఫలాలు నాకు సమర్పించు.
అభ్యాసం కంటే జ్ఞానం ,అంతకంటే ధ్యానం దానికన్నా కర్మఫలత్యాగం శ్రేష్ఠం.త్యాగం వలనే శాంతి కలుగుతుంది.
సర్వప్రాణులందూ ద్వేషం లేనివాడై,స్నేహం,దయను కలిగి,దేహేంద్రియాల పైన మమకారం లేని వాడై,సుఖదుఃఖాలు లేనివాడై,ఓర్పు కలిగి,నిత్య సంతోషంతో నిర్మల మనస్కుడై మనసును,బుద్దిని నా యందు నిలిపిన భక్తుడే నాకు ప్రియుడు.
లోకాన్ని భయపెట్టక,తాను లోకానికి భయపడక,ఆనంద ద్వేష భయచాంచల్య రహితుడైన వాడు నాకు ఇష్టుడు.
కోరికలు లేక,పరిశుద్దుడై,సమర్థత కలిగి తటస్థుడుగా ఉంటూ కర్మఫలితాల పైన ఆశలేనివాడు నాకు ఇష్టుడు.

సంతోషం, దుఃఖం, ద్వేషం, శుభా శుభములను వదిలినవాడు నాకు ప్రియుడు.
శత్రుమిత్రుల యందు సమాన దృష్టిగల వాడు, మాన, అవమానములందు, చలి, వేడి యందు, సుఖదుఃఖాలందు సమదృష్టి గలవాడు,కోరికలు లేనివాడు, దొరికినదానితో తృప్తిచెందేవాడు, మౌనియై,  స్థిరనివాసం లేక,స్థిరచిత్తం కలిగిన భక్తుడే నాకు ప్రియుడు.
పైన చెప్పిన ధర్మాన్ని నమ్మి ఆచరించి నన్ను ఉపాసించేవాడు నాకు అత్యంత ఇష్టుడు. 

 Chat Room 
   Y O G A  

 

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus