అగజాత, అఘుడు, అగస్త్య మహర్షి, Agajaatha, Aghu, Agasthya Muni

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — 

క్లుప్తముగా వాటి వివరాలు

Agajaatha – అగజాత :

 పార్వతీ దేవికి

శక్తి, అంబిక, అగజాత, దుర్వ, దేవి, దాక్షాయణి, భువనేశ్వరి, భవాని, భార్గవి, సతి, గిరికన్య, గిరిజ, గౌరి, కాత్యాయని, కాళి, మేనక, మాత అని అనేక పేర్లు ఉన్నాయి.

AghuDu – అఘుడు :

 రాక్షసులైన, పూతన, బకాసురుల సోదరుడు. కంసుడి అనుచరుడు.

అగస్త్య మహర్షి, Agasthya Muni : 

అగస్త్య మహర్షి హిందూ చరిత
్రలో ఒక గొప్ప ఋషి. 

దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు. 

ఈయన బ్రహ్మదేవుని మానస పుత్రుడు .

అగస్త్య మహర్షి కాశీలో వుండేవాడు, దక్షిణాపథానికి ఎందుకొచ్చాడు? అంటే, పూర్వం మహానుభావులు ఏమి చేసినా ప్రజా శ్రేయస్సుకోసమే చేసేవారు. అలాగే అగస్త్యుడుకూడా ప్రజల శ్రేయస్సు కోసమై కాశీలో సదాశివుని సన్నిధి విడిచి దక్షిణాపధానికి వచ్చాడు.భార్య పేరు లోపాముద్ర .


30/04/2015 7:35 PM